Monday, June 23, 2014

విశ్వనాదామృతం- కళాతపస్వి శ్రీ కె.విశ్వనాథ్ గారి చలన చిత్ర జీవిత సందర్శనం

                                                      
తెలుగు చలన చిత్ర చరిత్రలో తొలిసారిగా ఇంతటి సాహసోపేతమైన, చారిత్రక ప్రయత్నానికి రూప శిల్పులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీలాంటి విశ్వనాథ్ వీరాభిమానులు.  కె.విశ్వనాథ్ గారు  దర్శకత్వం వహించిన ఆణిముత్యాలవంటి చిత్రాల వెనుకనున్న సృజనాత్మక శక్తికి అక్షరదానం, గాత్రదానం, నటనా కౌశలం, సాంకేతిక పరిజ్జానం, ఆర్ధిక పరిపుష్టినీ అందించిన ఎందరో హేమా హేమీలు ఆత్మీయంగా వెలువరించిన భావాభిప్రాయాలతో, ఇప్పటి దాకా ఎవరికీ తెలియని విశేషాలని విశ్వనాధ్ గారు మనతో పంచుకునే అపురూప ప్రయత్నమే విశ్వనాదామృతం. విశ్వనాథ్ గారు తన చిత్రాల ద్వారా తెలియ చెప్పిన  భారతీయతని, సంగీత, నాట్య, సాహిత్యాల విలువలని   విశ్వనాదామృతం లో పదిలపరిచి తరువాతి తరాలకు కూడా అందజేయాలని తలపెట్టినదీ బృహత్కార్యం. 




కె విశ్వనాథ్ గారి ఒక్కొక్క సినిమానీ ఒక్కొక్క ఎపిసోడ్ గా తీసుకుని, కథ తొలి ఆలోచన, మలి పరిణామాలు, నటీనటుల ఎంపిక, సంగీత దర్శకుల ఎంపిక, పాటల రచయితల, గాయనీ గాయకుల అనుభవాలు...ఒక్కటేమిటి.. సినిమా రూప కల్పనకి సంబంధించిన అంతర్గత విశేషాలతో మొత్తం 36 ప్రత్యేక ఎపిసోడ్స్ గా ధారావాహిక నిర్మాణం గత ఆరు నెలలుగా చక చకా సాగుతోంది.

ఇప్పటికి మూడు షెడ్యుల్స్ హైదరాబాద్ సారధీ స్టూడియోలో నిర్మింపబడిన ప్రత్యేక సెట్లోనూ, ఇతర ఔట్ డోర్లో 12 ఎపిసోడ్స్ షూటింగ్ పూర్తయ్యింది. ధారావాహికకి ఏంకర్ పాడుతా తీయగా తొలి విజేతగా నిలిచి, అంచెలంచెలుగా ఎదిగిన సుప్రసిద్ధ గాయకుడు నేమాని పార్థు. ఇప్పటి దాకా అక్కినేని, అల్లు అరవింద్, వెంకటేష్, సిరివెన్నెల సీతారామ శాస్త్రి, మూన్మూన్ సేన్ మొదలైన అతిరథ మహారధులు విశ్వనాథ్ గారి శైలి గురించీ, ఆయా సినిమాల గురించీ తమ అభిప్రాయాలని తెలుపగా, విశ్వనాథ్ గారు తెలుగు చలన చిత్ర పరిశ్రమకి అందించిన సాహిత్య వరంసిరివెన్నెల సీతారామ శాస్త్రిగారు వెన్నుండి మహత్కార్యానికి తమ సహాయ సహాకారాలు అందిస్తున్నారు.


ఆర్ధిక పరంగా మేము ఇప్పటి దాకా సమకూర్చిన నిధులతో మూడు షెడ్యూల్స్ లో పన్నెండు ఎపిసోడ్లు పూర్తి చేశాం. ఇక మరొక రెండు షెడ్యూల్స్ లోశంకరాభరణంతో సహా మిగిలిన సినిమాల వివరాలు షూటింగ్ చేస్తాం. తరువాత, ఎడిటింగ్, పోస్ట్ప్రొడక్షన్ వర్క్ , టీవీ రిలీజ్ మొదలైన సాంకేతిక పరమైన పనులు చెయ్యవలసి ఉంటుంది. వీటన్నిటికీ మీ ఆర్ధిక సహాయాన్ని అర్ధిస్తున్నాం
టీవీ ధారావాహిక ఎలా చూసినా లాభాపేక్షతో కానీ, వాణిజ్య ప్రయోజనాలు ఆశించి కానీ తలపెట్టినది కాదు.  కేవలంకళాతపస్వివిశ్వనాథ్ గారి చలన చిత్ర జీవిత ప్రస్థానాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించే అత్యంత  ఆసక్తికరమైన, చారిత్రక ప్రాధాన్యత కలిగిన టెలివిజన్ ధారావాహికలో పాలు పంచుకొనే ఆసక్తి ఉన్న వారి కోసమే ప్రతిపాదన.. అభ్యర్ధన.. 


Please contact Ram Cheruvu Phone: 832 390 0882 / E-mail: ramteja@gmail.com for more information